భారతదేశం, ఏప్రిల్ 6 -- సాధారణంగా చిలుక మాట్లాడటం గురించి విని ఉంటాం. అందుకే చిలుక పలుకులు అనే పదాన్ని కూడా వాడుతుంటాం. కానీ కాకి కూడా మాట్లాడం గురించి ఎప్పుడైనా విన్నారా? మహారాష్ట్రలో ఓ కాకి మాట్లాడుతుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. మనుషులు చెప్పినట్టుగానే కొన్ని పదాలు చెబుతుంది ఆ కాకి. ఆ వివరాలేంటో చూద్దాం..

మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో ఒక కాకి ప్రధాన ఆకర్షణగా మారింది. కారణం దానికి మాటాలు రావడం. ఈ కాకి మనుషుల్లాగే మాట్లాడగలదు. మనం సాధారణంగా చిలుకలు మనుషులను అనుకరిస్తూ మాట్లాడటం చూస్తుంటాం. కానీ కాకి మాట్లాడటం చూడటం నిజంగా ఆశ్చర్యమే. ఈ కాకి బాబా, కాకా, అమ్మా, బాబు, ఏం చేస్తున్నావు? వంటి మాటలు మాట్లాడుతుంది.

పాల్ఘర్‌లోని వాడా తహసీల్‌లోని గార్గావ్ గ్రామానికి చెందినది ఈ కాకి. ఇక్కడ నివసించే మాంగల్య ముక్నే కొంతకాలం క్...