భారతదేశం, అక్టోబర్ 26 -- నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుసపెట్టి సినిమాలతో దూసుకుపోతోంది. ఇటీవలే రష్మిక మందన్నా నటించిన థామా మూవీ రిలీజ్ అయింది. ఇప్పుడు మరో సినిమాతో అలరించేందుకు రెడీ అయింది బ్యూటిపుల్ రష్మిక మందన్నా. ఆ సినిమానే "ది గర్ల్‌ఫ్రెండ్".

ఈ సినిమాలో హీరోగా దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి చేస్తున్నాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ది గర్ల్‌ఫ్రెండ్ మూవీకి హీరో కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు.

ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ది గర్ల్‌ఫ్రెండ్ నవంబర్ 7న హిందీతో ప...