భారతదేశం, మే 20 -- స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన 'థగ్‍లైఫ్' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ గ్యాంగ్‍స్టర్ యాక్షన్ మూవీ జూన్ 5వ తేదీన విడుదల కానుంది. నాయగన్ చిత్రం తర్వాత కమల్, మణి కాంబినేషన్ సుమారు 38ఏళ్ల అనంతరం రిపీట్ అవడంతో ఈ చిత్రంపై హైప్ విపరీతంగా ఉంది. ఇటీవలే వచ్చిన థగ్‍లైఫ్ ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ సినిమా నుంచి రెండో పాట రిలీజ్ గురించి మూవీ టీమ్ అప్‍డేట్ ఇచ్చింది. దీని తర్వాత మణిరత్నంపై కొందరు నెటిజన్లు ఆగ్రహిస్తున్నారు.

థగ్ లైఫ్ సినిమా నుంచి 'షుగర్ బేబీ' పేరుతో రెండో పాట రానుంది. మే 21వ తేదీన ఈ పాటను తీసుకొస్తామని మేకర్స్ ప్రకటించారు. త్రిషపై డబ్బు నోట్ల వర్షం కురుస్తున్నట్టుగా ఉన్న పోస్టర్‌తో ఈ పాటను టీమ్ అనౌన్స్ చేసింది.

ఈ పాటకు షుగర్ బేబీ అనే పేరు ఉండడంతో డైరెక్టర్ మణిరత్నంపై నెటి...