Hyderabad, ఏప్రిల్ 19 -- పూర్వం మట్టి పాత్రల్లో ఆహరాన్ని వండేవారు. ఇప్పుడు మళ్లీ ఆ ట్రెండ్ మొదలైంది. మట్టి పాత్రలు మార్కెట్లో విపరీతంగా అమ్ముడవుతున్నాయి. పాన్, తవా, హండీతో, జగ్గు, బాటిల్ ఇలా అన్ని రకాల పాత్రలు మట్టితో తయారుచేసి అమ్ముతున్నారు.

మట్టి పాత్రల్లో ప్రజలు వంట చేయడం, తినడం, త్రాగటం వంటివి చేస్తున్నారు. ఆ పాత్రలు వాడడం ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. అయితే ఈ కుండలను ఉపయోగించే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. తద్వారా పాత్రల వాడకం ఆరోగ్యానికి ఏ విధంగానూ హాని కలిగించదు.

కుండలు కొనుగోలు చేసేటప్పుడు, ఈ పాత్రల లోపలి భాగంలో గ్లేజ్ పూత లేదని గుర్తుంచుకోండి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ రిపోర్ట్ ప్రకారం, చాలా పూతలలో సీసం, కాడ్మియం ఉంటాయి. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. కాబట్టి మీరు మట్టి కుండలు కొనుగోలు చేసినప్పుడు మెర...