భారతదేశం, ఫిబ్రవరి 16 -- వరుస సూపర్ హిట్స్‌తో దూసుకుపోతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. అప్పుడప్పుడు పలు సినీ ఈవెంట్స్‌కు హజరవుతూ తన స్పీచ్‌తో అట్రాక్ట్ చేస్తుంటారు అనిల్ రావిపూడి.

సంతోష్ శోభన్, మానస వారణాసి హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ డ్రామా మూవీ కపుల్ ఫ్రెండ్లీ. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైంది. రిలీజ్ రోజు నుంచి సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది.

అయితే, మూవీ రిలీజ్‌కు రెండు రోజుల ముందు నిర్వహించిన కపుల్ ఫ్రెండ్లీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యారు అనిల్ రావిపూడి. కపుల్ ఫ్రెండ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ అవుతు...