భారతదేశం, జనవరి 3 -- వెనెజువెలా రాజధాని కారకాస్‌ నగరం శనివారం తెల్లవారుజామున పేలుళ్లలతో దద్దరిల్లింది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కనీసం ఏడు భారీ పేలుళ్లు సంభవించాయి. అదే సమయంలో యుద్ధ విమానాలు నగరంపై తక్కువ ఎత్తులో ప్రయాణించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు.

వెనెజువెలా- అమెరికా ఉద్రిక్తతలు, సైనిక కార్యకలాపాలు చేపడతామని అగ్రరాజ్య అధ్యక్షుడు చేసిన హెచ్చరికల నేపథ్యంలో దక్షిణ అమెరికా దేశంలో తాజా పరిణామాలు సర్వత్రా వార్తల్లో నిలిచాయి. ట్రంప్​ చెప్పింది చేసి ఉంటే, వెనెజువెలా గడ్డపై అమెరికా జరిపిన మొట్టమొదటి ప్రత్యక్ష దాడి ఇదే అవుతుంది.

నగరంలోని పలు ప్రాంతాల్లో కాల్పుల శబ్దాలు కూడా వినిపించాయని, ప్రధాన సైనిక స్థావరం సమీపంలోని దక్షిణ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అంత...