భారతదేశం, ఏప్రిల్ 28 -- హల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య సంబంధాలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ ఎప్పుడైనా పాకిస్థాన్‌పై దాడి చేయవచ్చునని అన్నారు. రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని అంగీకరించారు. ఈ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని సరిహద్దుల్లో పాక్ బలగాల మోహరింపును పెంచిందని, అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్టుగా చెప్పారు. పాక్ రక్షణ మంత్రి చేసిన ఈ ప్రకటన పాక్‌లో కలకలం రేపింది.

గతవారం పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించారు. పాకిస్థాన్‌పై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వచ్చాయి. దాడికి పాకిస్థాన్ మద్దతు ఇచ్చిందని భారతదేశం ఆరోపించింది. పాకిస్థాన్ ఆ ఆరోపణను తిరస్కరించింది. అయితే తాజాగా భారత్ చర్యలపై...