భారతదేశం, మే 4 -- భారత్​లో 15 గంటల రైలు ప్రయాణం తర్వాత తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్​తో ఆసుపత్రిలో చేరినట్లు అమెరికన్ ట్రావెల్ వ్లాగర్ వెల్లడించాడు. మిస్సోరీకి చెందిన నిక్ మాడాక్ ఎనిమిదేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ తన ఎక్స్​పీరియెన్స్​ని సోషల్ మీడియాలో డాక్యుమెంట్ చేస్తుంటాడు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదేశాలకు వెళ్లాడు. కానీ ఇండియాలో చేదు అనుభవం ఎదురవుతుందని అతను ఊహించలేదు. అసలేం జరిగిందంటే..

ఇండియన్ స్లీపర్ క్లాస్​లో 15 గంటల ప్రయాణం తర్వాత తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్​తో ఆసుపత్రిలో చేరినట్లు ఇన్ స్టాగ్రామ్​లో షేర్ చేసిన వీడియోల్లో ఈ అమెరికా వ్యక్తి వెల్లడించాడు.

ఓ వీడియోలో ఆయన ఆక్సీజన్ మాస్క్ ధరించి కనిపించాడు. ఇది 15 గంటల రైలు ప్రయాణమా? లేక వారణాసిలోని మృతదేహాల మధ్య వారం రోజులు గడపడమా? ఏదైతే ఏంటి.. నా ఊపిరితిత్తులు నాశనం ...