భారతదేశం, జూలై 31 -- బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 144 పాయింట్లు పెరిగి 81,482 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 34 పాయింట్లు పెరిగి 24,855 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 71 పాయింట్లు పడి 56,150 వద్దకు చేరింది.

అయితే, బుధవారం ట్రేడింగ్​ సెషన్​ ముగిసిన అనంతరం భారత్​పై 25శాతం సుంకాలు విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రకటించారు. గురువారం ట్రేడింగ్​ సెషన్​లో మార్కెట్​లు ఎలా ఉంటాయి? నిపుణుల మాటలు ఇవి..

ట్రంప్​ టారీఫ్​ ప్రకటనతో దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. గురువారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 200 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50కి 24,600 లెవల్​ సపోర్ట్​గాను, 24,930-25,000 లెవల్స్​ రెసి...