భారతదేశం, నవంబర్ 21 -- జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఇటీవలే ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. తమ విండ్‌సర్ ఈవీ మోడల్‌ను కేవలం 400 రోజుల్లోపే 50,000 యూనిట్లను భారత మార్కెట్‌లో విక్రయించినట్లు తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనం విషయంలో ఇది చాలా గొప్ప విజయం! ఈ విజయానికి నిదర్శనం ఏంటంటే.. టాటా నెక్సాన్ ఈవీ 50వేల అమ్మకాల సంఖ్యను చేరుకోవడానికి ఏకంగా 3 సంవత్సరాలు తీసుకుంది.

మరి ఇంత తక్కువ సమయంలో విండ్‌సర్ ఈవీ భారత మార్కెట్‌లో ఇంత పెద్ద విజయాన్ని సాధించడానికి, భారతీయుల్లో ఎక్కువ క్రేజ్​ పొందడానికి గల కారణాలు ఏంటో ఇక్కడ తెలుసుకోండి..

విండ్‌సర్ ఈవీ మొదటి, అతిపెద్ద ప్రయోజనం ఇందులో లభించే అపారమైన స్పేస్​. ఈ కారును ఎలక్ట్రిక్ స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించారు. దీని వీల్‌బేస్ 2700ఎంఎంగా ఉంది. దీనివల్ల లోపల కూర్చునే ప్రయాణికులకు చాలా ఎక్కువ స్థలం లభిస్త...