భారతదేశం, ఏప్రిల్ 18 -- భారతీయ సంస్కృతీ, వారసత్వానికి మరో గుర్తింపు లభించింది. భగవద్గీత, భరతముని రచించిన నాట్యశాస్త్రానికి యునెస్కో మెమెురీ ఆఫ్ వరల్ రిజిస్టర్‌లో చోటు దక్కింది. భారతదేశ కాలాతీత జ్ఞానాన్ని, కళాత్మక ప్రతిభను ఈ ప్రపంచ గౌరవంతో కొనియాడుతోందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు.

'ఈ గ్రంథాలు భారతదేశ ప్రాపంచిక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. భారతీయ జ్ఞాన సంపద, కళాత్మక ప్రతిభను ప్రపంచం గౌరవిస్తోంది. ఈ గ్రంథాలు భారత ప్రజల ఆలోచనలు, దార్శనికతను ప్రతిబింబిస్తాయి. వీటితో ఈ అంతర్జాతీయ రిజిస్టర్ లో మన దేశానికి చెందిన 14 రికార్డులు చేరాయి.'అని షెకావత్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్‌లో ప్రపంచానికి, ప్రపంచ స్థాయికి ఉపయోగపడే డాక్యుమెంట్‌లు ఉంటాయి. ఇంటర్నేషనల్ అడ్వైజరీ కమిటీ సిఫారసు తర్వాత ...