Andhrapradesh,tirumala, సెప్టెంబర్ 7 -- చంద్రగ్రహణం కారణంగా ఇవాళ సాయంత్రం 3.30 నుంచి తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. సెప్టెంబర్ 8వ తేదీన 3 గంటల వరకు అంటే. సుమారు 12 గంటల పాటు మూసివేయనున్నారు. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది.
ఇవాళ రాత్రి 9.50 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై రేపు వేకువజామున 1.31 గంటలకు పూర్తవుతుంది. సాధారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ.
సెప్టెంబర్ 8న ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. కాగా ఉదయం 6 గంటలకు శ్రీవారి దర్శనం భక్తులకు పునః ప్రారంభవుతుంది.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.