Andhrapradesh,tirumala, సెప్టెంబర్ 7 -- చంద్రగ్రహణం కారణంగా ఇవాళ సాయంత్రం 3.30 నుంచి తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. సెప్టెంబర్ 8వ తేదీన 3 గంటల వరకు అంటే. సుమారు 12 గంటల పాటు మూసివేయనున్నారు. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది.

ఇవాళ రాత్రి 9.50 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై రేపు వేకువ‌జామున 1.31 గంటలకు పూర్తవుతుంది. సాధారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ.

సెప్టెంబ‌ర్ 8న ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. కాగా ఉదయం 6 గంటలకు శ్రీవారి దర్శనం భక్తులకు పునః ప్రారంభవుతుంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....