Hyderabad, ఆగస్టు 18 -- కోర్ట్: స్టేట్ వర్సెస్ నోబడీ మూవీ ఈ ఏడాది ఎన్ని సంచలనాలు సృష్టించిందో మనకు తెలుసు కదా. మొదట బాక్సాఫీస్ దగ్గర, ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్ లోనూ దూసుకెళ్లింది. అలాంటి సినిమాను అందించిన రామ్ జగదీశ్ పెళ్లి చేసుకున్నాడు. ఆదివారం (ఆగస్టు 17) రాత్రి అతని పెళ్లి వైజాగ్ లో జరిగింది.

హీరో నాని నిర్మాతగా ఉన్న కోర్ట్ మూవీ ఈ ఏడాది పెద్ద హిట్. ప్రియదర్శి, శివాజీ, రోషన్, శ్రీదేవిలాంటి వాళ్లు నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాను రామ్ జగదీశ్ తెరకెక్కించాడు. తాజాగా ఈ యంగ్ డైరెక్టర్ ఓ ఇంటివాడయ్యాడు. వైజాగ్ లో కార్తీక అనే అమ్మాయిని అతడు పెళ్లి చేసుకున్నాడు. అతని పెళ్లి, రిసెప్షన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రామ్ జగదీశ్ పెళ్లికి కోర్ట్ మూవీ టీమ్ కూడా వచ్చింది. వీళ్లలో నటుడు శివాజీ రిసెప్షన్ ఫొటో...