భారతదేశం, ఫిబ్రవరి 19 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కల్యాణ్ నిజం చెప్పడంతో ధాన్యలక్ష్మీ ఫీల్ అవుతుంది. దాంతో అందరూ ధాన్యలక్ష్మిని తిడతారు. తనను ఏమనొద్దు అని కావ్య, రాజ్ అంటారు. నన్ను క్షమించురా అని ధాన్యలక్ష్మీ అంటుంది. తప్పు చేశాను, మన్నించండి అని పశ్చాత్తాపపడుతుంది. ఇంతలో డాక్టర్ అనురాధ వచ్చి అప్పుకు పాప పుట్టిందని చెబుతుంది.

దాంతో దుగ్గిరాల కుటుంబం సంతోషిస్తుంది. అంతా వెళ్లి అప్పు, పాపను చూస్తారు. ముచ్చటగా మూడో మహాలక్ష్మీ వచ్చిందే అని ఇందిరాదేవి అంటుంది. ఆ ట్రస్ట్ ప్రపోజల్ పెట్టకుండా ఉండాల్సింది. సారీ అని రాజ్ చెబుతాడు. కిడ్నాపర్స్ గురించి కల్యాణ్‌ను రాజ్ అడుగుతాడు. ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడారు. అది కవర్ చేయడానికి మీ పేర్లు వాడారని కల్యాణ్ చెబుతాడు.

అత్తింటికి పాపతో అప్పు వెళ్తుంది. హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకెళ్తారు. పాపకు ...