భారతదేశం, ఫిబ్రవరి 11 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 953వ ఎపిసోడ్ లో తాను చేసిన తప్పు నుంచి తప్పించుకోవడానికి రుద్రాణి మంత్రి ధర్మేంద్ర కాళ్లపై పడుతుంది. అప్పు తన పోలీసు మెదడుకు పని చెప్పి కూపీ లాగే పనిలో ఉంటుంది. మరోవైపు దుగ్గిరాల చారిటబుల్ ట్రస్ట్ అంటూ కావ్య ఓ గొప్ప ఆలోచనకు ఊపిరి పోస్తుంది.

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (ఫిబ్రవరి 11) ఎపిసోడ్ తన బిడ్డను ఎత్తుకొని రాజ్ ఎమోషనల్ అయ్యే సీన్ తో మొదలవుతుంది. తల్లి మనసు తన బిడ్డను గుర్తించినా తాను మాత్రం ఎందుకు గుర్తించలేకపోయానని రాజ్ బాధపడతాడు. బిడ్డ స్పర్శ, ఊపిరి తగిలినా ఆ బిడ్డ తన బిడ్డ కాదని తల్లి గుర్తించిందని, తాను మాత్రం నమ్మలేదని అంటాడు.

కావ్య వచ్చి అతన్ని ఓదారుస్తుంది. తల్లి మనసుకు ఆ గొప్పతనాన్ని ఇచ్చిన దేవుడు.. తండ్రికి బిడ్డపై ఎంతో ముందు చూపు ఇచ్చాడని అంటుంది. ఏ ఆడబిడ్డకైనా తల్లి కం...