భారతదేశం, జనవరి 23 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఇంట్లో డీఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ ఇంకా రావట్లేదని మాట్లాడుకుంటారు. 24 గంటల్లో మెయిల్‌కు వస్తుందని రాజ్ చెబుతాడు. కావ్య మాత్రం పాపను ఆడిస్తుంటుంది. మాకు చాలా టెన్షన్‌గా ఉంది. నువ్వు మాత్రం చాలా కూల్‌గా ఉన్నావని కావ్యను అడుగుతారు.

మీరు కాగితాలను నమ్ముతారు. నేను తల్లి ప్రేమను నమ్ముతున్నాను. నాకు రిపోర్ట్స్‌లో ఏం వస్తుందో నాకు తెలుసు కాబట్టి నిదానంగా ఉన్నాను అని కావ్య అంటుంది. ఇంతలో రిపోర్ట్స్ వస్తాయి. రాజ్ వచ్చాయని చెబుతాడు. రిపోర్ట్స్ చూసి రాజ్ షాక్ అవుతాడు. కల్యాణ్ కూడా చూసి షాక్ అవుతాడు. రిపోర్ట్స్‌లో ఏముందని అంతా అడుగుతారు.

ఈ పాప మన పాపే అని వచ్చిందమ్మా. పాప డీఎన్‌ఏ కళావతి డీఎన్ఏతో మ్యాచ్ అయిందని రాజ్ అంటాడు. దాంతో నో అని గట్టిగా అరుస్తుంది కావ్య. అంతా అబద్ధం అని గొడవ చేస్తుంది ...