భారతదేశం, జనవరి 22 -- ఈసారి రిపబ్లిక్ డేకి ముందే మనలో దేశభక్తిని నింపేందుకు ఓ అదిరిపోయే సినిమా రాబోతోంది. ఈ మూవీ పేరు 'బోర్డర్ 2'. ఈ సినిమా విడుదల కంటే ముందే అభిమానుల్లో భారీ అంచనాలు, ఆసక్తి నెలకొన్నాయి. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సన్నీ డియోల్, వరుణ్ ధావన్, అహాన్ శెట్టి, దిల్జీత్ దోసాంజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శుక్రవారం (జనవరి 23) 'బోర్డర్ 2' విడుదల కానుండగా అంతకుముందే ఇండియన్ ఆర్మీ అద్భుతమైన సాహసాన్ని, త్యాగాలను వెండితెరపై చూపించిన టాప్ సినిమాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

1971లో జరిగిన భారత పాకిస్థాన్ యుద్ధం సమయంలోని లోంగేవాలా చారిత్రక పోరాటం ఆధారంగా ఈ బోర్డర్ సినిమా తెరకెక్కింది. ఇందులో కేవలం 120 మంది భారతీయ సైనికులు, ఒక రాత్రంతా పాకిస్థాన్ ట్యాంక్ రెజిమెంట్‌ను ఒంటరిగా ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఈ సిని...