భారతదేశం, నవంబర్ 2 -- మచ్​ అవైటెడ్​ బుల్లెట్ 650 బైక్​ని నవంబర్ 4న జరగనున్న ఈఐసీఎంఏ 2025 మోటార్‌సైకిల్ షోలో ఆవిష్కరించడానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ సిద్ధమైంది. ఈ ఆవిష్కరణ పాత బుల్లెట్ నేమ్‌ప్లేట్‌కు ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది! ఈ మోటార్‌సైకిల్ గురించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ప్రపంచ ఆవిష్కరణ: నవంబర్ 4 2025, ఈఐసీఎంఏ షోలో.

ఇండియా ఎంట్రీ: నవంబర్ 21-23, 2025 మధ్య జరగనున్న కంపెనీ మోటోవర్స్ ఈవెంట్‌లో ఉంటుందని అంచనా.

రాబోయే బుల్లెట్ 650 బైక్​, క్లాసిక్ బుల్లెట్ కాలాతీత డిజైన్‌ను తీసుకుని, దానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ ఆధునిక 650సీసీ ఆర్కిటెక్చర్‌ను జోడించనుంది. ఇది క్లాసిక్ 650తో ప్లాట్‌ఫారమ్, ఇంజిన్‌ను పంచుకుంటుందని భావిస్తున్నారు. అయితే బుల్లెట్ సాంప్రదాయ ఆకర్షణను చాటిచెప్పే ప్రత్యేకమైన స్టైలింగ్ అంశాలను ఇది కలిగి ఉంటుంది....