Hyderabad, ఆగస్టు 27 -- టాలీవుడ్ హీరోయిన్, హీరో వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠీ త్వరలోనే తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. ఆమె తన బేబీ బంప్ తో గణేషుడి సేవలో తరిస్తున్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. ఈ ఫొటోలో అభిమానులు ఆమె బేబీ బంప్ తోపాటు పక్కనే స్టైలిష్ లుక్ లో ఉన్న వరుణ్ తేజ్ ను ప్రత్యేకంగా గమనించారు.

బుధవారం (ఆగస్టు 27) వరుణ్ తేజ్, లావణ్య ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్న పిక్చర్ ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ జంట చేతులు జోడించి వినాయకుడి విగ్రహం ముందు కూర్చొని ఉన్నారు. లావణ్య బ్లూ మ్యాక్సీ-స్టైల్ డ్రెస్ లో చాలా అందంగా కనిపించింది. వరుణ్ బేబీ పింక్ కుర్తా, వైట్ పైజామా వేసుకుని ట్రెడిషనల్ గా ఉన్నారు.

ఈ ఫొటోలో లావణ్య బేబీ బంప్ క్లియర్‌గా కనిపించింది. ఈ స్పెషల్ ఫొటోకు ఆమె బేబీ బంప్ మరింత అందాన్ని తీసుకొచ్చింది. ...