భారతదేశం, జూన్ 21 -- ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ సెడాన్​గా పేరు తెచ్చుకున్న హోండా సిటీలో సరికొత్త ఎడిషన్​ని తీసుకొచ్చింది హోండా సంస్థ. దీని పేరు హోండా సిటీ స్పోర్ట్​. ఈ కొత్త హోండా సిటీ స్పోర్ట్ ఎడిషన్ ధర రూ. 14.89 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభమవుతుంది. ఈ సెడాన్​ ఎక్స్​టీరియర్​, ఇంటీరియర్​లో​ బ్లాక్-ఔట్ చేసిన భాగాలు ఉన్నాయి. ఇవి దీనికి ప్రత్యేక ఆకర్షణను ఇస్తాయి. కొత్త సిటీ స్పోర్ట్ ఎడిషన్ పరిమిత సంఖ్యలో మాత్రమే లభిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఈ మోడల్​ ఈ విభాగంలో వోక్స్‌వ్యాగన్ విర్టస్, స్కోడా స్లావియా, హ్యుందాయ్ వెర్నాలకు గట్టి పోటీ ఇవ్వనుంది. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

హోండా సిటీ స్పోర్ట్ ఎడిషన్ సెడాన్ బాహ్య రూపాన్ని కొత్త అప్‌గ్రేడ్‌లతో మెరుగుపరుస్తుంది. క్రోమ్ గ్రిల్​కి, రేర్​ స్పాయిలర్​కి బ్లాక్​ ఫినిషింగ్​ వచ్చింది. ఓఆర్​వ...