భారతదేశం, అక్టోబర్ 7 -- టీవీఎస్ మోటార్ కంపెనీ తమ అత్యంత ప్రజాదరణ పొందిన టీవీఎస్ రైడర్ బైక్‌లో సరికొత్త వేరియంట్‌లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ కొత్త మోడల్స్‌లో డ్యుయెల్ డిస్క్ బ్రేక్‌లు (ముందు, వెనుక డిస్క్ బ్రేకులు), సింగిల్-ఛానెల్ ఏబీఎస్​ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) వంటి ఫీచర్‌లతో పాటు ఈ సెగ్మెంట్‌లో తొలిసారిగా అందిస్తున్న మరిన్ని అద్భుతమైన ఫీచర్లను జోడించింది.

బెస్ట్​ సెల్లింగ్​ టీవీఎస్​ రైడర్​ బైక్​లో కొత్తగా వచ్చిన ఈ వేరియంట్లలో, ఎస్​ఎక్స్​సీ డ్యుయల్ డిస్క్ వేరియంట్ ధర రూ. 93,800గా, టీఎఫ్​టీ డ్యుయల్ డిస్క్ వెర్షన్ ధర రూ. 95,600గా (రెండూ ఎక్స్-షోరూమ్ ధరలు) నిర్ణయించారు. ఇవి రైడర్ మోడల్స్‌లో ఇప్పటివరకు వచ్చిన వాటిల్లోకెల్లా అత్యంత అధునాతన వెర్షన్స్‌గా టీవీఎస్ పేర్కొంది.

ఈ కొత్త 125 సీసీ కమ్యూటర్ సెగ్మెంట్ బైక్‌లలో 'బూస్ట్ మోడ...