భారతదేశం, నవంబర్ 25 -- భారత్ డైనమిక్స్ లిమిటెడ్(BDL) 156 అప్రెంటిస్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల, అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక బీడీఎల్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ 08-12-2025 నిర్ణయించారు. దరఖాస్తు హార్డ్ కాపీలు పంపించడానికి చివరి తేదీ 12.12.2025గా ఉంది.

ఫిట్టర్ 70, ఎలక్ట్రీషియన్ 10, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 30, మెషినిస్ట్ 15, మెషినిస్ట్ గ్రైండర్ 02, మెకానిక్ డీజిల్ 05, మెకానిక్ R & Ac 05, టర్నర్ 15, వెల్డర్ 04 అప్రెంటీస్ ఖాళీలు ఉన్నాయి. మెుత్తం ట్రేడ్‌ అప్రెంటిస్‌ (ఐటీఐ) 156 ఖాళీలు.

అభ్యర్థులు ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. వయోపరిమితి విషయనికి వస్తే.. కనీస వయసు 14 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలుగా నిర్ణయించారు. నిబంధనల ప్రకార...