భారతదేశం, ఫిబ్రవరి 14 -- నాలుగేళ్ల బీఎస్సీ (నర్సింగ్) కోర్సులకు నీట్-యూజీ ద్వారా అడ్మిషన్లు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో వైద్య, ఆరోగ్య శాఖ సమర్పించిన ప్రతిపాదనను సీఎం చంద్రబాబు ఆమోదించారు. 2026-27 విద్యా సంవత్సరం నుండి నర్సింగ్ ప్రోగ్రామ్‌లలో చేరాలనుకునే విద్యార్థులు జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్-యూజీ) రాయాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 నుండి ప్రారంభమయ్యే నాలుగు సంవత్సరాల బీఎస్సీ నర్సింగ్ కోర్సును అభ్యసించడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు నీట్-యూజీకి ఇకపై హాజరు కావాలి. పోటీ పరీక్షలో వారు సాధించిన మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు ఉంటాయి. ఆరోగ్య శాఖ ఇటీవల ప్రతిపాదించిన విధంగా నీట్-యూజీ ద్వారా బీఎస్సీ నర్సింగ్ కోర్సును అభ్యసించడానికి విద్యార్థులను ఎంపిక చేయాలనే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించారు. ...