Hyderabad, సెప్టెంబర్ 28 -- బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ఉత్కంఠంగా సాగుతోంది. ఊహించని ఎలిమినేషన్స్, సీక్రెట్ టాస్క్, సడెన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో జోరుగా నడుస్తోంది. బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం మరొకరు ఎలిమినేట్ అయ్యారు. అయితే, ఇప్పటికే బిగ్ బాస్ 9 తెలుగు నుంచి మొదటి వారం శ్రేష్టి వర్మ, రెండో వారం మనీష్ మర్యాద ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయారు.

ఇప్పుడు ఇంకో వికెట్ పడింది. బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం నామినేషన్స్‌లో ఆరుగురు సెలెక్ట్ కాగా వారిలో హీరోయిన్ ఫ్లోరా సైని ఇమ్యునిటీ సాధించి ఎలిమినేషన్ నుంచి సేవ్ అయింది. దాంతో మూడో వారం బిగ్ బాస్ 9 తెలుగు నామినేషన్స్‌లో రీతూ చౌదరి, హరిత హరీష్, రాము రాథోడ్, ప్రియా శెట్టి, కల్యాణ్ పడాల ఐదుగురు ఉన్నారు.

వీరిలో అతి తక్కువ ఓటింగ్‌తో రావడంతో ప్రియా శెట్టి ఎలిమినేట్ అయింది. అగ్ని పరీక్ష ద్వారా సెలెక్ట్ అయి కామనర్...