భారతదేశం, నవంబర్ 28 -- బిగ్ బాస్ 9 తెలుగు జోరుగా సాగుతోంది. ఊహించని ట్విస్టులు, ఎలిమినేషన్స్, మాజీ కంటెస్టెంట్స్ ఎంట్రీతో ఆకట్టుకుంటోంది. పదకొండో వారం ఫ్యామిలీ వీక్ సాగగా పన్నెండో వారం బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ వచ్చి ప్రస్తుత బిగ్ బాస్ సీజన్ 9 హౌజ్‌మేట్స్‌తో పోటీ పడుతూ టాస్క్‌లు ఆడారు.

బిగ్ బాస్ తెలుగు 8 రన్నరప్ గౌతమ్ కృష్ణతో మొదలైన ఈ ఎంట్రీ బ్రహ్మముడి మానస్, ప్రేరణ కంబం, హీరో సయ్యద్ సోహైల్, దేత్తడి హారిక, ప్రిన్స్ యావర్, శోభా శెట్టితో సాగుతూ వచ్చింది. ఇదిలా ఉంటే పన్నెండో వారం కూడా ముగిసిపోనుంది. అంటే ఈ వీకెండ్ కూడా కంటెస్టెంట్స్ ఎలిమినేషన్‌ను ఫేస్ చేయనున్నారు.

బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం నామినేషన్స్‌లో 8 మంది ఉన్నారు. వారిలో కల్యాణ్ పడాల, తనూజ గౌడ, భరణి శంకర్, దివ్య నిఖితా, ఇమ్మాన్యూయెల్, సంజన గల్రాని, సుమన్ శెట్టి, డిమాన్ పవన్ ఇలా ఎన...