Hyderabad, సెప్టెంబర్ 26 -- బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ జోరుగా సాగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త ట్విస్టులతో బిగ్ బాస్ 9 తెలుగు నడుస్తోంది. ప్రస్తుతం హౌజ్‌లో 13 మంది కంటెస్టెంట్స్ ఉన్న విషయం తెలిసిందే. వీరిలో ఈ వారం మరొకరు ఎలిమినేట్ కానున్నారు. అయితే, ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది.

కానీ, ఈ వారం బిగ్ బాస్ తెలుగు 9 తెలుగులో సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే ఉంటుందని సమాచారం. అయితే, ఈ ఎలిమినేషన్‌లో ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయేందుకు డేంజర్‌లో నలుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్‌లో మొత్తంగా ఆరుగురు నామినేట్ అయ్యారు. వారిలో ఫ్లోరా సైనీ గురి తప్పకు టాస్క్‌లో గెలిచి ఇమ్యునిటీ సాధించింది.

దాంతో బిగ్ బాస్ తెలుగు 9 మూడో వారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకుని సేఫ్ అయిం...