భారతదేశం, మే 18 -- బిగ్‍బాస్ తెలుగు నెక్స్ట్ సీజన్ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. బిగ్‍బాస్ తెలుగు సీజన్ 9 ఎప్పుడు వస్తుందా అని క్యూరియాసిటీ ఉంది. ఈ తరుణంలో రీసెంట్‍గా ఓ రూమర్ బలంగా వినిపించింది. బిగ్‍‌బాస్ట్ 9 హోస్ట్‌గా గాడ్ ఆఫ్ మాసెస్, స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ వస్తారనే పుకార్లు చక్కర్లు కొట్టాయి. కింగ్ నాగార్జున కంటిన్యూ కారనే ఊహాగానాలు వినిపించాయి. ఈ విషయంపై తాజాగా ఓ క్లారిటీ బయటికి వచ్చింది.

బిగ్‍బాస్ట్ హోస్ట్‌గా నాగార్జునే కొనసాగుతారని, సీజన్ 9కు కూడా ఆయనే ఉంటారని ఓటీటీ ప్లే రిపోర్ట్ వెల్లడించింది. ఈ సీజన్‍కు బాలకృష్ణ హోస్ట్‌గా ఉండడం లేదని పేర్కొంది. నెక్స్ట్ సీజన్ కోసం నాగార్జున సైన్ కూడా చేశారని తమకు సంబంధిత వర్గాల ద్వారా తెలిసిందని ఆ రిపోర్ట్ వెల్లడించింది. దీన్ని బట్టి నాగార్జునే బిగ్‍బాస్ తెలుగు 9వ సీజన్‍కు కూడా కంటిన్...