భారతదేశం, ఫిబ్రవరి 8 -- బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యరాయ్, హ్యాండ్సమ్ నటుడు రాజేష్ ఖన్నా.. ఈ ఇద్దరు వేర్వేరు తరాలకు చెందిన నటీనటులు. కానీ ఈ ఇద్దరూ కలిసి పాపులర్ మూవీ టైటానిక్ లో నటిస్తే? రోజ్, జాక్ పాత్రలు పోషిస్తే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనతోనే ఓ అద్భుతమైన ఏఐ వీడియో క్రియేట్ అయింది. ఇప్పుడు ఇది ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఏఐ వీడియోలో హాలీవుడ్ చిత్రం 'టైటానిక్' లోని కేట్ విన్స్‌లెట్, లియోనార్డో డికాప్రియో పాత్రలలో బాలీవుడ్ స్టార్స్ ఐశ్వర్యరాయ్, రాజేష్ ఖన్నా కనిపించారు. అభిమానుల మదిలో ఇంకా తాజాగా ఉన్న టైటానిక్ సినిమాలోని కొన్ని సీన్లలో ఈ ఇద్దరిని ఇప్పుడు చూడొచ్చు.

మిస్టర్ హెల్ రాకర్ అనే ఏఐ ఆర్టిస్ట్ ఐశ్వర్యరాయ్, రాజేష్ ఖన్నాతో టైటానిక్ సినిమాలోని కొన్ని సీన్లను ఏఐలో రీక్రియేట్ చేశాడు. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో...