భారతదేశం, డిసెంబర్ 12 -- పెద్ద స్టార్ హీరో సినిమా రిలీజ్ ఎఫెక్ట్ చిన్న మూవీస్‌పై పడుతుందన్న విషయం తెలిసిందే. అయితే, ఈసారి అన్నింటికి భిన్నంగా అగ్ర కథనాయకుడి సినిమా విడుదల ప్రభావం ఓటీటీ వెబ్ సిరీస్‌పై పడింది. దీంతో ఆ సిరీస్ ఓటీటీ రిలీజ్‌ను వాయిదా వేసుకుంది. చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి అని చెప్పుకోవచ్చు.

ఆ సినిమా అఖండ 2 అయితే, వెబ్ సిరీస్ 3 రోజెస్ సీజన్ 2. నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో నాలుగో సినిమాగా, అఖండ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన మూవీనే అఖండ 2 తాండవం. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా ఆది పినిశెట్టి విలన్‌గా చేసిన అఖండ 2 డిసెంబర్ 5న విడుదల కావాల్సింది.

కానీ, నిర్మాణ సంస్థ 14 రీల్స్, ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థల మధ్య ఫైనాన్స్ క్లాష్ వల్ల వారం ఆలస్యంగా అంటే ఇవాళ (డిసెంబర్ 12) థియేటర్లలోకి అడుగుపెడుతుంది అఖండ 2. దీంతో ఇవాళ థియ...