భారతదేశం, జనవరి 12 -- టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఫ్యాషన్ సెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెస్ట్రన్ డ్రెస్సుల్లో ఎంత స్టైలిష్‌గా కనిపిస్తారో, చీరకట్టులో అంతకంటే మిన్నగా 'అచ్చతెలుగు ఆడపడుచు'లా మెరిసిపోతుంటారు. తాజాగా ఆమె తన అప్-కమింగ్ చిత్రం 'మా ఇంటి బంగారం' ప్రమోషన్లను వినూత్నంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి.

తను ధరించిన చీరకట్టు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. "బాపు బొమ్మ సిరీస్ - మెత్తదనంలోనూ శక్తి ఉంటుందని, సరళత మర్చిపోలేనిదని నిరూపించిన ఆ మహోన్నత కళాకారుడికి ధన్యవాదాలు" అని సమంత పేర్కొన్నారు. బాపు గీసిన బొమ్మల్లో ఉండే ఆ హుందాతనం, సౌకుమార్యం సమంత తాజా లుక్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఈ ప్రమోషనల్ ఈవెంట్ కోసం సమంత 'అనావిల' బ్ర...