భారతదేశం, జనవరి 26 -- వ్యక్తిగత కష్టాలను, విషాదాలను అధిగమించి, తమ రంగాల్లో రాణించడమే కాకుండా సమాజ సేవ కోసం జీవితాన్ని అంకితం చేసిన 45 మందికి 'అన్​-సంగ్​ హీరోస్​' కేటగిరీలో 2026 పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. వీరి ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం. ఈ నేపథ్యంలో వీరి గురించి, సమాజానికి వీరు అందిస్తున్న సేవల గురించి ఇక్కడ తెలుసుకుందాము..

ఆసియాలోనే మొట్టమొదటి హ్యూమన్ మిల్క్ బ్యాంక్‌ను స్థాపించి రికార్డు సృష్టించిన ముంబైకి చెందిన పీడియాట్రీషియన్ అర్మిడా ఫెర్నాండెజ్ 2026 పద్మశ్రీ అవార్డుల జాబితాలో ఉన్నారు. బ్లాక్​ ఫీవర్​ గుర్తింపు కోసం అత్యంత చౌకైన పరీక్షను అభివృద్ధి చేసిన శ్యామ్ సుందర్, హీమోఫీలియా వ్యాధిగ్రస్తుల కోసం విశేష కృషి చేసిన హెమటాలజిస్ట్ సురేష్ హంగావడి సైతం ఈ లిస్ట్​లో ఉన్నారు.

లడఖ్‌కు చెందిన పద్మ గుర్మెత్ పురాతన టిబెటన్ వైద్య విధానాన్ని ...