భారతదేశం, డిసెంబర్ 9 -- అతిరథ్ హోల్డింగ్స్ ఇండియా లిమిటెడ్ తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో గ్లోబల్ తెలంగాణ రైజింగ్ సమ్మిట్ 2025లో అతిరథ్ హోల్డింగ్స్ ఛైర్మన్ లెఫ్టినెంట్ ఆర్ బాలకృష్ణన్, తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్యం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంతకాలు చేశారు. రాష్ట్ర పునరుత్పాదక శక్తి లక్ష్యాల్లో ఇది ఒక పెద్ద మైలురాయిగా చెప్పవచ్చని ప్రభుత్వం పేర్కొంది.

ఈ సందర్భంగా లెఫ్టినెంట్ బాలకృష్ణన్ మాట్లాడుతూ తెలంగాణలో స్థిరమైన ఇంధన భవిష్యత్తు వైపు ఒక ముందడుగుగా అభివర్ణించారు. రూ.4,000 కోట్లతో రాష్ట్రంలో 25 కంప్రెస్డ్ బయో-గ్యాస్ (సీబీసీ) ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రతి ప్లాంట్ రోజుకు 20 టన్నుల (టీపీడీ) సామర్థ్యం కలిగి ఉంట...