భారతదేశం, డిసెంబర్ 22 -- కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టే ముందు కారు కొనుగోలుదారులకు హ్యుందాయ్ ఇండియా భారీ సర్​ప్రైజ్​ ఇచ్చింది. తన ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిపై డిసెంబర్ నెలకు గానూ అదిరిపోయే డిస్కౌంట్లను ప్రకటించింది! ఎంపిక చేసిన మోడళ్లపై ఏకంగా రూ. 10 లక్షల వరకు ప్రయోజనాలను కల్పిస్తోంది. అయితే, ఈ ఆఫర్లు కేవలం 2024లో తయారైన, స్టాక్ ఉన్న వాహనాలకు మాత్రమే వర్తిస్తాయని కంపెనీ స్పష్టం చేసింది.

ప్రస్తుతం హ్యుందాయ్ ఇండియా మార్కెట్లో 'ఐయోనిక్ 5', 'క్రెటా ఈవీ' అనే రెండు ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. వాటిపై ఈ నెలలో లభిస్తున్న డిస్కౌంట్లను ఇక్కడ చూడండి..

హ్యుందాయ్ ప్రీమియం ఎలక్ట్రిక్ క్రాస్ ఓవర్ 'ఐయోనిక్ 5' పై ఏకంగా రూ. 10 లక్షల వరకు భారీ డిస్కౌంట్ లభిస్తోంది. దీని ప్రత్యేకతలు చూస్తే:

రేంజ్ అండ్​ పవర్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 631 కిలోమీటర్లు ప్రయాణి...