భారతదేశం, సెప్టెంబర్ 13 -- ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్' సేల్​కి సంబంధించిన డీల్స్​ని సంస్థ రివీల్​ చేసింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ వెల్లడించిన డీల్స్ ప్రకారం.. ఐఫోన్ 16 రూ. 52,999కి, ఐఫోన్ 16 ప్రో రూ. 69,999కి, ఐఫోన్ 16 ప్రో మాక్స్ రూ. 69,999కి, పిక్సెల్ 9 సుమారు రూ. 35,000కి అందుబాటులో ఉండనున్నాయి. చూడటానికి ఈ డీల్స్ చాలా ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, కొనుగోలు చేసే ముందు కొన్ని ముఖ్య విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి! ఏ మోడల్ కొనాలి? ఏది వదిలేయాలి? అనే అంశాలపై ఒక సులభమైన గైడ్ కింద ఉంది.

పిక్సెల్ 9: ఇది ప్రాసెసింగ్ పరంగా అత్యంత శక్తివంతమైన ఫోన్ కాకపోవచ్చు. కానీ దీనికి సంబంధించిన ఓవర్‌హీటింగ్, నెట్‌వర్క్ సమస్యలపై వదంతులు ఎక్కువగా ఉన్నాయి. ఐఫోన్ 16 ప్రోతో పోలిస్తే ఇది చాలా తక్కువ హీట్​ని ఉత్పత్తి ...