భారతదేశం, ఏప్రిల్ 24 -- ెనాల్ట్ ట్రైబర్ భారత మార్కెట్లో సరసమైన 7 సీటర్ కారు. ఈ 7 సీటర్ ఎంపీవీని కేవలం రూ.6.15 లక్షల ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధరకే కొనుగోలు చేయవచ్చు. రెనాల్ట్ ఇండియాలో అత్యంత సరసమైన 7 సీటర్. ట్రైబర్‌ను FY2025లో మొత్తం 19,905 మంది కొత్త కస్టమర్లు కొనుగోలు చేశారు.

రెనాల్ట్ ట్రైబర్ అనేక ఫీచర్లతో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీకి మద్దతు ఇచ్చే 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది. దీనికి 182ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉంది. దీని కారణంగా ఇది ఏ రకమైన రోడ్డుపైనైనా సులభంగా నడుస్తుంది. ఇంకా 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, పవర్ విండోస్(ముందు, వెనుక), పవర్ అడ్జస్టబుల్ అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్లు, రెండో, మూడో వరుస కోసం AC వెంట్లు ఉన్నాయి. దీని మూడో వరుస సీట్లను...