భారతదేశం, నవంబర్ 18 -- ఎడ్​టెక్​ రంగంలో లీడింగ్​ సంస్థ ఫిజిక్స్​వాలా ఐపీఓకు బంపర్​ లిస్టింగ్​ లభించింది! మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఈ ఐపీఓ షేర్లు భారీ లాభాలతో లిస్ట్​ అయ్యాయి. అప్పర్​ ప్రైజ్​ బ్యాండ్​ రూ. 109తో పోల్చితే ఫిజిక్స్​ వాలా షేర్లు బీఎస్​ఈలో రూ. 145 వద్ద 33శాతం లాభాలతో లిస్ట్​ అయ్యాయి. అదే సమయంలో ఎన్​ఎస్​ఈలో రూ. 143.10 వద్ద 31.28శాతంతో ఓపెన్​ అయ్యాయి.

అనేక మంది స్టాక్​ మార్కెట్​ నిపుణలు.. ఈ ఫిజిక్స్​వాలా షేర్లను లాంగ్​ టర్మ్​ వ్యూతో చూస్తున్నారు. ఇది షార్ట్​-టర్మ్​ రిటర్నుల కోసం కాదని చెబుతున్నారు.

""భారత ఎడ్​టెక్​ రంగంలో ఫిజిక్స్​వాలా ఐపీఓ ఒక కీలక ఘట్టం! ఇది వ్యవస్థల స్థాయిలో డిజిటల వైరాలిటీకి చిహ్నం. ఈ కంపెనీ ఆదాయం ఎఫ్​వై23లోని రూ. 772 కోట్ల నుంచి ఎఫ్​వై25లో రూ. 3వేల కోట్లకు చేరింది. అంటే ఇందులో టాప్​లైమ్​ మూమెంటమ్​, బ్రాం...