భారతదేశం, ఏప్రిల్ 16 -- ఏపీలో విద్యాహక్కు చట్టం కింద 2025-26 విద్యా సంవత్సరానికి అన్ని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూళ్లలో పేద, బలహీన వర్గాల పిల్లలకు 1వ తరగతిలో 25 శాతం సీట్లు కేటాయించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలలో(ఐబీ/సీబీఎస్ఈ/ఐసీఎస్ఈ/స్టేట్ సిలబస్) ప్రవేశాలకు 5 సంవత్సరాలు నిండిన వారు ఈ నెల 28వ తేదీ నుంచి మే 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తుల పరిశీలన అనంతరం ప్రభుత్వం సీట్లు కేటాయిస్తుంది.

విద్యాహక్కు చట్టం ప్రకారం బలహీన వర్గాల పిల్లలకు వారి నివాస సమీపంలోని అన్ని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలో 1వ తరగతిలో 25 శాతం కేటాయిస్తారు. విద్యార్థులు ఆధార్ ద్వారా https://cse.ap.gov.in/ వెబ్ సైట్ లో సీట్ల కేటాయింపు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఎంపికైన విద్యార్థుల జాబితా వివ...