Hyderabad, అక్టోబర్ 9 -- ఓటీటీ వచ్చిన తర్వాత సినిమాలకు దీటుగా వెబ్ సిరీస్ కూడా దుమ్మురేపుతున్నాయి. అలాంటి ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ కూడా. 2020లో వచ్చిన ఒక హిందీ కామెడీ వెబ్ సిరీస్ ఇది. ఈ సిరీస్ ఏకంగా 66 అవార్డులు గెలుచుకుంది. ఇప్పటికి ఈ సిరీస్‌కు నాలుగు సీజన్లు వచ్చాయి. మరి ఆ సిరీస్ ఏంటో చూసేయండి.

మనం మాట్లాడుకుంటున్న ఈ సిరీస్ హిందీ వెబ్ సిరీస్‌ల జాబితాలో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో ఒకటి. నాలుగు సీజన్లలో కలిపి ఇందులో మొత్తం 32 ఎపిసోడ్‌లు ఉన్నాయి. ఆ వెబ్ సిరీస్ పేరు పంచాయత్. 2020లో తొలి సీజన్ ప్రేక్షకుల ముందుకు రాగా.. తర్వాత మరో మూడు సీజన్లతో అలరించింది. ఈ వెబ్ సిరీస్ కు ఐఎండీబీలో ఏకంగా 9 రేటింగ్ నమోదు కావడం విశేషం.

ఈ సిరీస్ మొదటి సీజన్ 2020లో వచ్చింది. రెండవ సీజన్ 2022లో, మూడవ సీజన్ 2024లో, నాలుగో సీజన్ జూన్ 2025లో స్ట్రీమి...