Hyderabad, ఏప్రిల్ 25 -- మన చుట్టూ ఎంతో మంది సినిమా పిచ్చోళ్లు ఉంటారు. ఏ సినిమా వచ్చిన వదలకుండా చూడటమే వాళ్ల పని. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటి సినిమా పిచ్చోళ్ల చుట్టూ తిరిగేదే. కానీ వీళ్లు ఎక్కడో ముంబైకి పరిమితమైన సినిమాను ఓ మారమూలన ఉండే తమ ఊరికి తీసుకొచ్చే వాళ్ల కథ. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను మిస్ కావద్దు.

మనం చెప్పుకుంటున్న ఆ సినిమా పేరు సూపర్‌బాయ్స్ ఆఫ్ మాలేగావ్ (Superboys of Malegaon). ఈ సినిమా ఫిబ్రవరి 28న థియేటర్లలో రిలీజైంది. ఇదొక రియల్ స్టోరీ. మహారాష్ట్రలోని మాలేగావ్ అనే ఓ చిన్న టౌన్ లోని కొందరు యువకులు.. సినిమాపై ఉండే పిచ్చి ప్రేమతో తమ ఊళ్లోనే సినిమాలు తీస్తూ తమ కలలను సాకారం చేసుకుంటారు.

అలాంటి వాళ్ల కథకు సినిమా రూపమే ఇది. ఈ సినిమా శుక్రవారం (ఏప్రిల్ 25) నుంచి అమెజాన్ ప్రైమ్ వీ...