భారతదేశం, ఫిబ్రవరి 9 -- 'అర్జున్ రెడ్డి', 'మహారాజ్' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న శాలిని పాండే, శశి కపూర్ మనవడు జహాన్ కపూర్ జంటగా నటించిన మ్యూజికల్ డ్రామెడీ సిరీస్ 'బ్యాండ్‌వాలే' (Bandwaale). అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానున్న ఈ సిరీస్ విశేషాలు, స్ట్రీమింగ్ తేదీ వివరాలు ఇక్కడ చూడండి.

మ్యూజిక్, కామెడీ, ఎమోషన్ కలగలిపిన జోనర్ 'మ్యూజికల్ డ్రామెడీ'. ఈ జోనర్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి సరికొత్త హిందీ వెబ్ సిరీస్ రాబోతోంది. అదే 'బ్యాండ్‌వాలే'. ప్రముఖ సంగీతకారుడు, రచయిత స్వనంద్ కిర్కిరే కో క్రియేటర్‌గా వ్యవహరించిన ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఈ వెబ్ సిరీస్ లో శాలిని పాండేతోపాటు జహాన్ కపూర్ (శశి కపూర్ మనవడు), స్వనంద్ కిర్కిరే, సంజన దీపు, ఆశిష్ విద్యార్థి, అనుపమ కుమార్ లాంటి వాళ్లు నటించారు. అక్షత్ వర్మ డైరెక్ట్ చ...