భారతదేశం, జనవరి 25 -- గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రియాంక చోప్రా మెయిన్ లీడ్‌గా నటించిన తాజా చిత్రం 'ది బ్లఫ్' (The Bluff). పైరెట్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ది బ్లఫ్ ట్రైలర్ ఇటీవల విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

అయితే, తాజాగా ది బ్లఫ్ ట్రైలర్ చూసిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, నిర్మాత, రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ ప్రశంసలు కురిపించారు. ప్రియాంక చోప్రా నటనను మెచ్చుకుంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.

మహేశ్ బాబు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో 'ది బ్లఫ్' ట్రైలర్‌ను షేర్ చేస్తూ.. ప్రియాంక చోప్రాను 'ఫార్మిడబుల్' (మరింత శక్తివంతమైనది) అని అభివర్ణించారు. "ట్రైలర్ చాలా బాగుంది. ప్రియాంక చోప్రా మరోసారి తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ఫిబ్రవరి ...