Hyderabad, జూన్ 24 -- ఇండియాలో మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్‌లలో ఒకటైన 'ది ఫ్యామిలీ మ్యాన్' మూడో సీజన్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మనోజ్ బాజ్‌పాయీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ స్పై థ్రిల్లర్ సిరీస్ కు సంబంధించి తాజాగా సీజన్ 3 కొత్త పోస్టర్‌ రిలీజైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ పోస్టర్‌ను తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో షేర్ చేసింది. ఈ పోస్టర్ చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తోంది.

ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ మూడో సీజన్ కొత్త పోస్టర్‌లో మనోజ్ బాజ్‌పాయీ పాత్ర శ్రీకాంత్ తివారీ చాలా ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తోంది. అంతేకాదు ఉత్కంఠభరితమైన దృశ్యాలు, యాక్షన్ సన్నివేశాలను సూచిస్తూ సీజన్ 3 కథలోని సస్పెన్స్‌ను హైలైట్ చేస్తున్నాయి.

"మా ఫ్యామిలీ మెన్‌పై అందరి కళ్లు" అనే క్యాప్షన్‌తో పోస్టర్‌ను షేర్ చేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో, "కొత్త సీజన్ త్వరలో" అ...