భారతదేశం, మే 19 -- ప్రియమణి రెండుపాత్రలు పోషించిన చారులత సినిమా 2021 సెప్టెంబర్ నెలలో విడుదలైంది. కన్నడ, తమిళంలో ద్విభాషా చిత్రంగా ఈ మూవీ తెరకెక్కింది. తెలుగు, మలయాళంలోనూ డబ్బింగ్ అయి థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకు పొన్ కుమరన్ దర్శకత్వం వహించారు. థాయ్ సినిమా అలోన్‍ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. హారర్ ఎలిమెంట్లు, ట్విస్టులతో చారులత మూవీ మెప్పిస్తుంది.

చారులత సినిమాను ఇప్పుడు చూడాలంటే ఉచితంగానే అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్‍లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు. ఇప్పటి వరకు చూడకపోతే ఓ లుక్ వేయవచ్చు.

చారులత సినిమా తెలుగులో శ్రీబాలాజీ ఫుల్ మూవీస్ అనే యూట్యూబ్ ఛానెల్‍లో అందుబాటులో ఉంది. అక్కడ ఈ సినిమాను ఫ్రీగా చేసేయవచ్చు. ఇంగ్లిష్ సబ్‍టైటిల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

ఈ సినిమాలో శరీరం కలిసి ఉండే చారు, లత అనే అవిభక్త కవలల పాత్రలు పోషించారు ప్రి...