భారతదేశం, అక్టోబర్ 28 -- కరీంనగర్ జిల్లాలో కురిక్యాల పాఠశాలలో షాకింగ్ ఘటన జరిగింది. పాఠశాల అటెండర్ బాలికల వాష్ రూమ్‌లో సీక్రెట్ కెమెరాను ఏర్పాటు చేశాడు. హెడ్ మాస్టర్ ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతమంది బాలికలు వాష్‌రూమ్‌లో అనుమానాస్పదంగా వెలుగుతున్న కెమెరా పరికరాన్ని గమనించి దాని గురించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని పాఠశాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ దారుణం చేసింది పాఠశాల అటెండర్ యాకూబ్‌గా గుర్తించారు. ఈ విషయాన్ని బాలికలు గుర్తించి తల్లిదండ్రులకు చెప్పారు. తల్లిదండ్రులు హెడ్మాస్టర్కు ఫిర్యాదు చేశారు. సబ్-ఇన్స్పెక్టర్ వంశీ కృష్ణ, చొప్పదండి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్‌లకు హెడ్మాస్టర్ సమాచారం అందించగా, వారు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు పాఠశాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.