భారతదేశం, అక్టోబర్ 28 -- కరీంనగర్ జిల్లాలో కురిక్యాల పాఠశాలలో షాకింగ్ ఘటన జరిగింది. పాఠశాల అటెండర్ బాలికల వాష్ రూమ్‌లో సీక్రెట్ కెమెరాను ఏర్పాటు చేశాడు. హెడ్ మాస్టర్ ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతమంది బాలికలు వాష్‌రూమ్‌లో అనుమానాస్పదంగా వెలుగుతున్న కెమెరా పరికరాన్ని గమనించి దాని గురించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని పాఠశాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ దారుణం చేసింది పాఠశాల అటెండర్ యాకూబ్‌గా గుర్తించారు. ఈ విషయాన్ని బాలికలు గుర్తించి తల్లిదండ్రులకు చెప్పారు. తల్లిదండ్రులు హెడ్‌మాస్టర్‌కు ఫిర్యాదు చేశారు. సబ్-ఇన్‌స్పెక్టర్ వంశీ కృష్ణ, చొప్పదండి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ కుమార్‌లకు హెడ్‌మాస్టర్ సమాచారం అందించగా, వారు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు పాఠశాల...