భారతదేశం, మార్చి 31 -- భారత్‌లో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి కొత్త ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసే సమయంలో 2 ఐఎస్ఐ సర్టిఫైడ్ హెల్మెట్లు ఇవ్వడం తప్పనిసరి చేశారు. ఇటీవల దిల్లీలో జరిగిన ఆటో సమ్మిట్‌లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ కొత్త విధానాన్ని ప్రకటించారు. రైడర్ మాత్రమే కాకుండా వెనుక కూర్చున్న వారి భద్రతను నిర్ధారించడం, హెల్మెట్ ధరించేలా ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం.

టూ వీలర్ హెల్మెట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (టీహెచ్ఎంఏ) ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. ఈ నిబంధన ద్వారా వేలాది మంది ప్రాణాలను కాపాడవచ్చని సంస్థ భావిస్తోంది. టీహెచ్ఎంఏ ప్రెసిడెంట్ రాజీవ్ కపూర్ ఇది భద్రత దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా అభివర్ణించారు. ఇది దేశంలో హెల్మెట్ల అవసరాన్ని చెబుతుందన్నారు.

ప్రపంచంలోనే అత్యధిక రోడ్డు ప్రమాదా...