భారతదేశం, జూన్ 14 -- పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'ది రాజా సాబ్' సినిమా టీజర్ కోసం సినీ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా కాలం తర్వాత ఎంటర్‌టైనింగ్ రోల్‍ను ప్రభాస్ చేయడంతో మరింత ఎగ్జైట్‍మెంట్ నెలకొంది. ఈ హారర్ రొమాంటిక్ కామెడీ చిత్రానికి మారుతీ దర్శకత్వం వహిస్తున్నారు. టీజర్ రిలీజ్ డేట్, టైమ్ కూడా వెల్లడయ్యాయి. తాజాగా టీజర్ రన్‍టైమ్ ఎంతనే సమాచారం బయటికి వచ్చింది.

ది రాజా సాబ్ టీజర్ 2 నిమిషాల 2 సెకన్లు (122 సెకన్లు) ఉంటుందని సమాచారం వెల్లడైంది. ఈ విషయం సోషల్ మీడియాలో అప్పుడే వైరల్ అయింది. ఈ టీజర్ ఎలా ఉంటుందోననే క్యూరియాసిటీ పెరిగిపోతోంది.

ది రాజా సాబ్ సినిమా టీజర్ మరో రెండు రోజుల్లో జూన్ 16వ తేదీన ఉదయం 10 గంటల 52 నిమిషాలకు రిలీజ్ కానుంది. ఈ వివరాలను మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. ఈ చిత్రం నుంచి ఓ ...