భారతదేశం, మే 9 -- పాకిస్థాన్ దాడిపై విదేశాంగ మంత్రిత్వ శాఖ మీడియా సమావేశం నిర్వహించింది. ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించింది. ఈ సందర్భంగా కల్నల్ సోఫియా ఖురేషీ సైన్యం తరఫున సమాచారం అందించారు. పిరికిపంద చర్యలో భాగంగా గురువారం పాకిస్థాన్ పౌర విమానాలను కవచంగా ఉపయోగించుకుందని అన్నారు. తద్వారా భారత్ ప్రతీకారం తీర్చుకోవడానికి ఇబ్బంది ఎదురైందని చెప్పారు. దాడి సమయంలో పాకిస్థాన్ తన పౌర విమానాలను నడపడం ఆపలేదని కల్నల్ ఖురేషీ మీడియా సమావేశంలో అన్నారు.
పాకిస్తాన్ నుంచి ఈ దాడి జరిగినప్పుడు కరాచీ, లాహోర్ వంటి పెద్ద నగరాల్లో ప్యాసింజర్ విమానాలు ఎగురుతున్నాయని, దీనివల్ల ఉద్దేశపూర్వకంగా పౌరుల ప్రాణాలను ప్రమాదంలో పడేశారని ఖురేషీ అన్నారు. వాస్తవానికి పౌర విమానాలను కవచంగా మార్చడం వెనుక పాక్ వ్యూహం ఏమిటంటే, పౌర విమానాలపై ఏదైనా దాడి జరిగితే అంతర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.