భారతదేశం, మే 6 -- ప్రకాశం జిల్లా పొదిలిలో స్వల్ప భూకంపం వచ్చింది. మంగళవారం ఉదయం 9.54 గంటలకు భూమి కంపించింది. సుమారు 5 సెకన్లపాటు భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. కొత్తూరులోని రాజు ఆసుపత్రి వీధి, బ్యాంకు కాలనీ, ఇస్లాంపేటలో ప్రకంపణలు వచ్చాయి. దీంతో మహిళలు ఇండ్లలోనుంచి పరుగులు తీశారు.
తెలంగాణలోనూ సోమవారం సాయంత్రం భూమి కంపించింది. కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, వేములవాడ, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో భూప్రకంపనలు వచ్చాయి. భూకంపం రావడంతో భయంతో ప్రజలు బయటికి పరుగులు తీశారు. రెండుసార్లు భూమి తీవ్రంగా కంపించిందని స్థానికులు అంటున్నారు. కరీంనగర్‌తో పాటు శివారు ప్రాంతాల్లో భవనాలు, ఇండ్లు కంపించాయి.
భూమి లోపలి టెక్టోనిక్ ప్లేట్లు కదలడం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భూకంపాలు సంభవిస్తున్నాయని.. నిపుణులు చెబుతున్నారు. ఈ ప్లేట్లు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.